calender_icon.png 15 November, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేరళలో కూరగాయల సాగు భేష్

15-11-2025 12:05:01 AM

-ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం

-రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి) : కేరళ రాష్ర్టంలో ఉద్యానవన పంటల సాగు కోసం అమలవుతున్న పాలసీ బాగుందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలి పారు. కౌలు రైతుల విషయంలో సైతం కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం ఆదర్శమన్నారు. కేరళలో అమలవుతున్న విధానాలను తెలంగాణలో అమలయ్యేలా రాష్ర్ట ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపారు.

కేరళ రాష్ట్రం లో పాలక్కాడ్ జిల్లాలోని వడవన్నూర్, ఎలెవంచెరి గ్రామాల్లో సాగవుతున్న కూరగాయల తోటలను కమిషన్ బృందం శుక్రవారం సందర్శించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం కూరగాయల పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి కృషి చేస్తున్నారని కోదండరెడ్డి వివరించా రు.

కేరళలో అమలులో ఉన్న సహకార వ్యవసాయ పద్ధతులను, వడవన్నూర్, ఎలెవంచెరి పరిధిలో యూనిట్లను పరిశీలించారు. కేరళ రాష్ర్టంలో సాగు విధానంపై పవర్‌పాయింట్ ప్ర జెంటేషన్ ద్వారా వివరించారు. ఈ పర్యటనలో కమిషన్ సభ్యులు కేవీఎన్‌రెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీరెడ్డి, గడుగు గంగాధర్, కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్, ఉద్యనవన శాఖ అధికారి సురేష్, అధికారులు పాల్గొన్నారు.