16 April, 2026 | 11:23 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

సంపూర్ణ అక్షరాస్యత సాధనకు సమష్టిగా కృషి చేయాలి

27-05-2025 12:44 AM

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్, మే 26 (విజయ క్రాంతి ):  నిజామాబాద్‌ను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా, అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు.

స్వయం సహాయక సంఘాలలోని ప్రతి సభ్యురాలి విద్యార్హతలు గుర్తిస్తూ, నిరక్షరాస్యులుగా ఉన్న వారికి చదవడం, రాయడం నేర్పించాలనే బృహత్తర సంకల్పంతో రాష్ట్రంలోనే తొలిసారిగా సెర్ప్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, సమగ్ర శిక్ష, వయోజన విద్యా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఇందూరు అక్షరలక్ష్మి’ పేరుతో రూపొందించిన యాప్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఐడీఓసీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ఆవిష్కరించారు.

సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా యాప్ ను రూపొందించడం పట్ల కలెక్టర్ సంబంధిత అధికారులను అభినందించారు. సంపూర్ణ అక్షరాస్యత సాధన కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సాయాగౌడ్, ఏ.పీ.డీ రవీందర్, డీఈఓ అశోక్, డీడబ్ల్యూఓ రసూల్ బీ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీ, వయోజన విద్యా సంయుక్త సంచాలకులు గోవింద్ రావు, స్వయం సహాయక మహిళా సమాఖ్య ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.