16 April, 2026 | 11:36 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

బీఆర్‌ఎస్ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలి

15-06-2025 12:42 AM

ముషీరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): భోలక్ పూర్ లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకులు అంకిత భావంతో పనిచేస్తూ బీఆర్‌ఎస్ ను మరింత బలోపేతం చేయాలని భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ ఇన్చార్జి రాజా దీన్ దయాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాసరావులు అన్నారు. శనివారం భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం రంగానగర్లో జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల మేరకు ప్రతి నెల పోలింగ్ బూత్ల వారిగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషిచేయాలన్నారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరి ష్కరిం చాలన్నారు. అప్పుడే ప్రజల్లో నాయకులకు, పార్టీకి ఆదరణ లభిస్తుందన్నారు.

అనంతరం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులకు సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, గోవింద్ రాజ్, మైనార్టీ కమిటీ అధ్యక్షుడు మగ్బూల్, సోషల్ మీడియా ఇన్చార్జి ప్రవీణ్ కుమార్, నాయకులు కృష్ణ, మహేష్, కళ్యాణ్, అజీపాషా తదితరులు పాల్గొన్నారు.