3 April, 2026 | 3:53 PM

తెలంగాణ తల్లి చేతిలోకి మళ్లీ బతుకమ్మ రావాలి

19-09-2025 01:14 AM

-కాంగ్రెస్ వైఫల్యాలపై మూడు బతుకమ్మ పాటల రూపకల్పన

-తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించిన బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): తెలంగాణ తల్లి చేతిలోకి మళ్లీ బతు కమ్మ రావాలని బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మా రె డ్డి, కోవాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, కవిత, పద్మా దేవేందర్‌రెడ్డి, ఉమా ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై రూపొందించిన మూడు బతుకమ్మ పాటలను గురువారం తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు. బతుకమ్మకు కేసీఆర్ చీరలు కానుక ఇచ్చారని గుర్తు చేశారు. బతుకమ్మ, బోనాలు కూడా తెలంగాణ ఉద్యమ రూపం తీసుకున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆఫీసుల్లో బతుకమ్మ ఆడుకొనే అవకాశం కేసీఆర్ ఇచ్చారని పేర్కొన్నారు.