19-09-2025 01:13:50 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : పర్యావరణలో పొంచి ఉన్న మా ర్పులను సమష్టిగా ఎదుర్కోవాలని, అప్పుడే మానవాళిని వ్యవసాయ, ఉద్యాన రంగాలను కాపాడుకోగలమని భారత వాతావర ణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర అన్నారు. ‘ఉద్యాన రంగం పై పర్యావరణ మార్పుల ప్రభావం’ అనే అంశంపై గురువారం ములుగులోని ఉద్యాన విశ్వవిద్యాలయం వేదికగా రెండు రోజుల నిర్వహించే జాతీయ సదస్సు ప్రారంభమైంది.
ఈ సదస్సును శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విద్యాలయం, ఉద్యాన శాఖ, నాబార్డ్, ఎర్త్ సెన్సైస్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంయు క్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతంగంపై పర్యావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
పర్యావరణ మార్పులు కేవలం రైతాంగాన్ని, ప్రజలనే కాకుండా వాతావరణ శాఖను సైతం ఇబ్బంది పెడుతుందని, అందుకు దీటైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పర్యావరణ మార్పులకు అనుగుణం గా సాగులో మార్పులు, పంటల ఎంపికలలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని, గ్లోబల్ యాక్షన్, లోకల్ ప్రొడక్షన్ పద్ధతిలో పంటల సాగు జరగాలని ఆయన సూచించారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన అన్ని పరిశోధనలు, విధానాలు దేశ ఆహార భద్రత కోసమే జరిగాయని, దేశ పోషక భద్రత కోసం అందరు పని చేయాలని అందుకు తగిన విధివిధానాలు రూపొందించుకోవాలన్నారు. వాతా వరణ శాఖ, సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.
కార్యక్రమంలో తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ కే ఉదయభాస్కర్, బోర్లాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియా రీజనల్ ప్రోగ్రాం లీడర్ డాక్టర్ ప్రమోద్ కుమార్ అగర్వాల్, వర్సిటీ రిజిస్టర్ డాక్టర్ భగవాన్, ప్రముఖ వాతావరణ శాఖ, ఉద్యాన ఉద్యాన నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.