19-09-2025 01:14:44 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి)ఃబ్రిటిష్ యూనివర్సిటీల్లో చదివే తెలం గాణ విద్యార్థులకు యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవనింగ్ స్కాలర్ షిప్‌ను కోజూ ప్రతిపాదన అందిస్తామని బ్రిటిష్ హైకమిషనర్ కామెరాన్ పేర్కొ న్నారు. భారత్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో గురువారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.
ముఖ్యంగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్‌షిప్ కో ప్రాతిపదికన తెలంగా ణలోని మెరిట్ విద్యార్థులకు అందించేందుకు ఈ సందర్భంగా బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ అంగీకరించారు. అలాగే ఎడ్యుకేషన్, టెక్నాలజీ సంబంధిత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్న ట్టు సీఎంకి బ్రిటిష్ హైకమిషనర్ వివరించారు.
యూకేలోని యూనివర్సిటీలలో చదు వుకునే తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి అక్కడి యూనివర్సిటీలు ఆపరేట్ చేసేలా చూడాలని ఈ సంద ర్భంగా బ్రిటిష్ హైకమిషన ర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.ఈ సందర్భంగా తెలంగా ణలో తీసుకురాబోతుఉన్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్‌ను బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొ ఫెసర్లకు ట్రైనింగ్ అందించేందుకు బ్రిటిష్ హైకమిషనర్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటిష్ కంపెనీలు భాగస్వామ్యం కావాలని కోరారు.
జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరగా.. దీనికి బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ సానుకూలంగా స్పం దించారు. సమావేశంలోహైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళినీ రాఘురామన్, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.