30 August, 2026 | 3:13 AM

సర్‌ను వేగవంతం చేయాలి

30-08-2026 01:13 AM
  1. బీఎల్‌వోలు ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి నోటీసులు అందజేయాలి
  2. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సీఈవో సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్ ఆగస్టు 29 (విజయక్రాంతి) : రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ వేగవం తం చేయడంపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సం దర్భంగా నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ పురోగతిపై ఆయన నిశితంగా సమీక్షించారు.

ఈ కాన్ఫరెన్స్‌లో సీఈవో సుదర్శన్‌రెడ్డి.. కలెక్టర్లు, అధికారులకు పలు కీలక ఆదేశాలు జా రీచేశారు. బీఎల్‌వోలు ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి నోటీసులు అందజేయాలని సూచించారు. విచారణ జరిగే తేదీ, సమయం, ప్రాం తం వివరాలను సంబంధిత ఓటర్లకు కనీసం రెండు రోజులు ముందుగానే స్పష్టంగా తెలియజేయాలని, నోటీసులు అందుకున్న ఓట ర్ల నుంచి వారం రోజుల్లోగా వివరణ తీసుకోవాలని ఆదేశించారు.

నోటీసుతోపాటు సమర్పించాల్సిన అవసరమైన పత్రాల వివరాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పిం చాలని తెలిపారు. నో మ్యాపింగ్, అనామలీస్ ఉన్న ఓటర్ల జాబితాలను రాజకీయ పార్టీలకు తక్షణమే అందించాలని పేర్కొన్నారు. అభ్యంతరాలు, క్లెయిమ్‌లకు సంబం ధించిన వివరాలను ప్రతి వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పంచుకోవాలని సీఈవో ఆదేశించారు.