14 April, 2026 | 1:33 PM

ఒలంపిక్‌లో మెడల్స్ సాధించాలి

09-06-2025 11:31 PM

ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి..

అదిలాబాద్ (విజయక్రాంతి): రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే పథకాలు సాధించగలమని, ఒలింపిక్ క్రీడల్లో జిల్లా క్రీడాకారులు మెడల్స్ సాధించాలని ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి(Olympic Association President Govardhan Reddy) ఆకాంక్షించారు. ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సహా టైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు నెలరోజుల పాటు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శిక్షణ పొందిన క్రీడాకారులకు బెల్టులు, ప్రశంస పత్రాలు అందించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రతి సెలవు దినంలో అదిలాబాద్ వాసులకే కాకుండా చుట్టుపక్కల మండల స్థాయిగాని, గ్రామస్థాయి నుండి గాని నేర్చుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క క్రీడాకారునికి టైక్వాండో ఉచిత శిక్షణ ఇస్తామని టైక్వాండో మాస్టర్ వీరేష్ తెలపడం అభినందనీయం గోవర్ధన్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పోరెడ్డి పార్థసారధి, మాస్టర్ వీరేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివ ప్రసాద్, ఆఫీస్ సెక్రటరీ శృతి, కోశాధికారి సీనియర్ కోచ్ శివ ప్రసాద్, మాధవి, రాథోడ్ వనిత తదితరులు పాల్గొన్నారు.