14 April, 2026 | 5:04 PM

Breaking News

రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ పలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •  

తొలి తరం వైద్యులు డాక్టర్ భూంరెడ్డి

10-06-2025 12:00 AM

కరీంనగర్, జూన్ 9 (విజయక్రాంతి): వైద్య వృత్తికే వన్నెతెచ్చిన డాక్టర్ భూoరెడ్డి (81) మృతి చెందారు. సీనియర్ వైద్యులు, సాహిత్యాభిమాని, గతం లో ఒక సంవత్సరం సినారే పురస్కార ప్రదాత గా వ్యవహరించిన డాక్టర్ వి. భూంరెడ్డి  సోమవారం సాయం త్రం 4:40 పరమపదించారు.

ఉత్తర తెలంగాణ జిల్లాలలో మొట్టమొదటి సర్జన్ గా పే రు ప్రఖ్యాతలు సంపాదించుకొని వైద్య వృత్తికే వన్నెతెచ్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ వి. భూoరెడ్డి  మృతి అత్యంత బా ధాకరమని, కేంద్ర మంత్రి బండి సంజయ్,రాష్ట్ర మంత్రి పొన్నం ప్రబకట్, మాజీ  ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఏనుమల్ల నరేష్ లు తమ సంతాప సందేశం లో అన్నారు.

కరీంనగర్ జిల్లాలో వైద్య వృత్తికే వన్నె తెచ్చి,ఎంతో మందికి ఆదర్శప్రాయుడయ్యారని అలాంటి గొప్ప వైద్యనిపుణులు భూoరెడ్డి మరణం బాధాకరమని ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ  కుటుంబానికి సానుభూతివ్యక్తంచేశారు.