12-02-2026 12:54:55 AM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
చంపాపేట డివిజన్‌లో నాలా పనుల పరిశీలన
ఎల్బీనగర్, ఫిబ్రవరి 11 : ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంగా చేపట్టిన నాలా విస్తరణకు స్థానికులు సహకరించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. చంపాపేట డివిజన్ పరిధిలోని ఉదయ్ నగర్ కాలనీలో జరుగుతున్న నాలా పనులను బీఆర్‌ఎస్ నాయకుడు గండికోట శ్రీనాద్ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్థానికులతో కలిసి పరిశీలించారు. ఉదయ్ నగర్ కాలనీ, సూర్య నగర్ కాలనీ, ఎంఆర్‌ఆర్ కాలనీ, పవన్ పురి కాలనీ, పద్మానగర్ కాల నీ, న్యూ పద్మానగర్ కాలనీ, పద్మ ఎంక్లేవ్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పర్యటించారు.
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ నాలా వెడల్పు పనులను సకాలంలో పూర్తి చేసి, ముంపు సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఏసీబీ ప్రతాప్, ఈఈ కార్తిక్, ఏఈ సురేశ్, బీఆర్‌ఎస్ నాయకులు ఓరుగంటి వెంకటేష్, కృష్ణమాచారి, రాజిరెడ్డి, రోజారెడ్డి, రవిముదిరాజ్, చీర శ్రీనివాస్, మల్లేష్ గౌడ్, కొత్తపేట ప్రభాకర్, అంజిరెడ్డి, యాదిరెడ్డి, ముద్ద కళ్యాణ్, సదానంద్ రెడ్డి, సురేందర్ రెడ్డి, కనకేశ్, సతీశ్, రమాదేవి, వసంత, చందుయాదవ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.