3 July, 2026 | 11:39 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలి

14-04-2025 12:00 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

నల్లగొండ, ఏప్రిల్ 13 (విజయక్రాంతి) :  రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, జ్యోతిరావ్ పూలే, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను స్థానిక నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.

మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసిన గ్రామస్తులను అభినందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని పేర్కొన్నారు. తాటికోల్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేసి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.