18-09-2025 05:19:49 PM
వలిగొండ (విజయక్రాంతి): గాంధీ ఆశేషాలను ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీవో జలంధర్ రెడ్డి(MPDO Jalander Reddy) అన్నారు. గురువారం వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థి, విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జలంధర్ రెడ్డి మాట్లాడుతూ నేటి బాలరే రేపటి భావి భారత పౌరులని వారు గాంధీ చూపిన అహింసా, శాంతి మార్గంలో నడవాలని, ప్రతి ఒక్కరు ఉన్నత లక్ష్యంతో చదువుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సుంకోజు భాస్కర్, కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.