calender_icon.png 18 September, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగెం మూసీ వంతెనపై గుర్తుతెలియని మృతదేహం లభ్యం

18-09-2025 05:21:32 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని సంగెం గ్రామం పరిధిలో గల మూసీ లోలెవెల్ వంతెనపై నుండి వెళ్తున్న వరద నీటి ప్రవాహంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది. మృతదేహం హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి లేదా మూసీ పరివాహక ప్రాంతాల నుండి కొట్టుకొని వచ్చి ఉండవచ్చునని గ్రామస్తులు భావిస్తున్నారు. అయితే మృతదేహం సరిగ్గా మూసీ లోలెవెల్ వంతెన మధ్యలో మృతుడి ఒంటిపై బట్టలు లేకుండా కనిపించడంతో అటువైపు వచ్చిన పలువురు భయభ్రాంతులకు గురై స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.