4 June, 2026 | 2:14 AM

సైక్లింగ్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాం

04-06-2026 01:43 AM

జిల్లా అటవి అధికారి ఎస్ సత్యనారాయణ

ముకరంపుర, జూన్ 3 (విజయక్రాంతి): సైక్లింగ్ ఆరోగ్యంపై చక్కటి ప్రభావం చూపుతుందని, సైక్లింగ్ చేయడం ద్వారా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటామని, రోజు వారి కార్యకలాపాలను చాలా ఉషారుగా చేయగలుగుతామని కరీంనగర్ జిల్లా అటవి అధికారి ఎస్ సత్యనారాయణ అన్నారు.

బుధవారం ప్రపంచ సైక్లింగ్ డే సందర్భంగా జిల్లా సైకిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్ నుండి ఎలగందుల వరకు ఏర్పాటు చేసిన సైక్లింగ్ ర్యాలీని రూరల్ ఏసిపి విజయ్ కుమార్, కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ ‘అల్ఫోర్స్‘ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి, అధ్యక్షులు డాక్టర్ కెప్టెన్ బి.మధుసూదన్, ప్రతినిధులతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రదేశాలైన ఫ్రెన్స్, జర్మనిలో సైక్లింగ్ కు చాలా క్రేజ్ ఉందని, ప్రాధాన్యత ఇస్తున్నారని, తద్వారా వారు వనరులను భావి తరాలకు సంరక్షించడమే కాకుండా పర్యావరణాన్ని సైతం కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు వి జగదీశ్వర చారి, ఎం. అరవింద్ బాబు, మధు, తిరుపతి, ఏం.మహేందర్, అఖిల్, క్రీడాకారులు పాల్గొన్నారు.