4 June, 2026 | 2:15 AM

పాలమూరుకు సీఎం : జూపల్లి

04-06-2026 01:40 AM

మహబూబ్‌నగర్, మే 3 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి గురు, శుక్రవారాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. సాగునీటి ప్రాజెక్టులను సందర్శిం చనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. జడ్చర్లలో బహిరంగ సభా ప్రాంగణాన్ని సందర్శించి, ఏర్పాట్లపై సమీక్షించారు. జడ్చర్ల ఏరియా ఆసుపత్రి సమీపంలో ఖాళీ స్థలంలో ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాట్ల పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ జానకితో కలిసి పరిశీలించారు.  కరివెన రిజర్వాయర్ వద్ద ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను కూడా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఓ.ఎస్.డి  తదితరులు ఉన్నారు.