calender_icon.png 16 July, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బిడ్డ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడినీ తీవ్రంగా ఖండిస్తున్నాం

16-07-2025 12:00:00 AM

వనపర్తి టౌన్ జులై 15: బీసీ బిడ్డ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై అతనికి చెందిన క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేసిన జాగృతి కార్యకర్తలు,ఎమ్మెల్సీ కవిత అనుచరుల మీద తక్షణమే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బిసిఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.కురుమూర్తి,ముఖ్య అతిథి గా బిసిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నగనమోని చెన్న రాములు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు యం.శ్రీనివాస్ సాగర్ లు డిమాండ్ చేశారు..

మంగళవారం జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో ఆయన మాట్లాడుతూ క్యూ న్యూస్ ఆఫీస్ పై జాగృతి గుండాలు దాడి చేసి ఆఫీస్ లోని ఫర్నిచర్ ధ్వంసం చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బందినీ భయభ్రాంతులకు గురిచేసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై దాడి చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని బడుగు బలహీనవర్గాల గొంతుక వినిపించే క్యూ న్యూస్ ఛానల్ పై దాడి చేయడం అంటే రెండు కోట్ల మంది బీసీల బిడ్డల మీద దాడి చేయడమేనని అన్నారు.

బీసీ లా కోసం కోట్లాడే మల్లన్నకు మద్దతుగా మేమంతా ఏకం అవుతున్నం అని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో BCF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్ మాజీ ఎంపీటీసీ, రాష్ట్ర కార్యదర్శి ఏర్పుల తిరుపతి యాదవ్ రాష్ట్ర ఉపాధ్యకులు భగవంతు గౌడ్, తదితర మండలాల బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.