సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
బాన్సువాడ డివిజన్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు..
బాన్సువాడ (విజయక్రాంతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బాన్సువాడ డివిజన్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సమావేశమైన ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించి సుప్రీంకోర్టు సీజేఐ బిఆర్ గవాయ్ పై సనాతన ధర్మం పేరుతో మతోన్మాదులు రెచ్చిపోతున్నారనీ, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నత పదవులు,హోదాలో ఉంటే ఓర్వలేకపోతూ ఇలాంటి దూచ్చర్యలకు పాల్పడటం చాలా అవమానకరం అని వారు మండిపడ్డారు.
ఇలాంటి చర్యలను ఇలాంటి రౌడీలు చేసే చర్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇలాంటి చర్యలను ప్రోత్సహించక గవాయ్ పై బూటుతో దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి సుమోటో కేసు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేయాలని వారూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు దేశాయిపేట్ ప్రశాంత్ కుమార్ ,ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఏజాజ్ బాన్సువాడ ఏఎంసీ మాజీ చైర్మన్ నరసింహులు, జిల్లా ఉపాధ్యక్షులు గైని రవి, మాల మహానాడు మండల నాయకులు మల్లూరు సాయిలు, రెడ్డి లక్ష్మీ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ లు కొత్త బాద్ సాయిలు, తడ్కోల్ రాజు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు న్యాల కంటి గంగాధర్ దొన కంటి వినోద్ అంబేద్కర్ సంఘం నాయకులు నక్క విజయ్ కుమార్ బేగరీ డాక్టర్ సాయిలు పరిమళ సాయిలు వాగుమారే మారుతి ఆర్టీసీ, పోతరాజు సాయిలు, మామిడి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.




