calender_icon.png 8 October, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల పూర్వ విద్యార్థి టీవీ బహుకరణ

08-10-2025 04:34:47 PM

చిట్యాల (విజయక్రాంతి): పాఠశాల పూర్వ విద్యార్థి తాను చదివిన పాఠశాలకు 43 ఇంచుల టీవీని బుధవారం బహుకరించారు. చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన పీక పృథ్విరాజు పాఠశాల పూర్వ విద్యార్థి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వనిపాకలకు 43 అంగుళాల(ఇంచుల) టీవీని బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇకముందు కూడా పాఠశాలకు నాయొక్క సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కౌసల్య, ఉపాధ్యాయులు శంకర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.