22-02-2026 01:46:19 AM
కాంగ్రెస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని బీజేపీ ఖండిస్తోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు శనివారం ప్రకటనను విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో చర్చకు స్థానం ఉండా లి గానీ, హింసకు కాదని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అల్లర్లకు పాల్పడటం అత్యం త దుర్మార్గమని పేర్కొన్నారు.
శాంతిభద్రత లను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కామారెడ్డిలో ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తే బీజే పీ సహించదని హె చ్చరించారు. ఇలాం టి రాజకీయ హింసాత్మక చర్యలకు ప్రజాస్వామ్యంలో ఏమాత్రం స్థా నం లేదని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడానికి, అలాగే పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి నిజాలు ప్రజల ముందుకు తీసుకురావడానికి తాను స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శిస్తానని, హింసను ప్రోత్సహించే రాజకీయాలను భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు.
అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టాలి
బాన్సువాడలో హిందూ మహిళపై దురుసుగా ప్రవర్తించి అత్యాచారయత్నానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, పీడీ యాక్ట్ పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. బాన్సువాడలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
శాంతియుత నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని, అలాంటి హక్కును అరెస్టుల ద్వారా అణచివేయడం అత్యంత విచారకరమని తెలిపారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం సమర్థనీయం కాదని తెలిపారు. హింసకు, అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.