15 April, 2026 | 12:20 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

తెలంగాణలో సామాన్యుడి పరిస్థితి ఏంటి?

22-02-2026 01:48 AM

కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎమ్మెల్యే కార్యాలయమే సురక్షితం లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపలి వెంకటరమణ రెడ్డి క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఎక్స్ వేదికగా శనివారం ఆయన ఖండించారు. ఇది మీ ప్రజాపాలనా? అంటూ నిలదీశారు. వాదనలకు రాళ్లు, దాడులతో సమాధానం ఇస్తున్నారా? అంటూ మండిపడ్డారు. నిఘా బృందాలు ఏం చేస్తున్నాయని, ప్రజాప్రతినిధికి రక్షణ లభించకపోతే ఎలా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను ఓడించే ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు.