మా ప్లాట్లు మాకే కావాలి
సోమలింగేశ్వరనగర్ ప్లాట్స్ ఓనర్స్ డిమాండ్
ఎల్బీనగర్, ఆగస్టు 24: తమ ప్లాట్లు తమకే చెందాలని కోరుతూ హయత్‌నగర్ రెవెన్యూ పరిధిలోని సోమలింగేశ్వరనగర్ ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యు లు శనివారం ఆందోళన చేపట్టారు. ప్లాట్ల ఓనర్లు తమ స్థలాలను చదును చేయించడానికి జేబీసీలను తీసుకురాగా.. సురేందర్ రెడ్డి అనే వ్యక్తి అడ్డుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సురేందర్‌రెడ్డిని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సంద ర్భంగా అసోసేయేషన్ సభ్యులు మాట్లాడుతూ.. తమ ప్లాట్లను సురేందర్‌రెడ్డి అక్రమించాడని ఆరోపించారు.
సర్వేనంబర్లు 180, 187లోని 9.26 ఎకరాల స్థలాన్ని యజమాని భిక్షపతి గతంలో లే అవుట్ చేసి 101 ప్లాట్లను విక్రయించాడు. ఆ తర్వాత 2004 లో భిక్షపతి కుటంబ సభ్యులు 9.26 ఎకరాల స్థలా న్ని సురేందర్‌రెడ్డికి విక్రయించారు. అప్పటి నుంచి ప్లాట్ల ఓనర్లు, సురేందర్‌రెడ్డికి వివా దం కొనసాగుతున్నది. దీనిపై కోర్టుకెళ్లగా ప్లాట్ల ఓనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినాకూడా సురేందర్‌రెడ్డి స్థలాన్ని వీడటంలేదని ప్లాట్ల ఓనర్లు ఆరోపించారు. సురేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకో వాలని కోరారు.






