calender_icon.png 14 November, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేసింది చెప్పుకోలేకనే ఓటమి పాలయ్యాం

20-05-2024 01:39:34 AM

సర్కార్‌ని నిలదీసే ధిక్కార స్వరాలు కావాలి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఇప్పుడు కాంగ్రెస్ చేయనివి కూడా చేశామంటోంది

అబద్ధాలతో అధికారం చేపట్టింది 

* మండలి పట్టభద్రుల ఎన్నికల్లో బిట్స్‌పిలానీలో చదువుకున్న ఉన్నత విద్యావంతుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డిని బీఆర్‌ఎస్ అభ్యర్ధిగా నిలబెట్టాం. అటువైపున బ్లాక్‌మెయిలర్, రాజకీయ విలువలు లేని, బెదిరింపులతో దిక్కుమాలిన దందాలు చేసే వ్యక్తి ఉన్నారు.

యాదాద్రి భువనగిరి, మే19 (విజయక్రాంతి): రాష్ట్రంలో పదేళ్లపాటు అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పటికీ చేసింది చెప్పుకోవడంలో విఫల మైనందునే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నా హాక సమావేశంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. పదేండ్లు అధికారం చెలాయించిన ప్రధాని నరేంద్రమోదీని దేశానికి ఏం చేశారంటే ముఖం చాటేసి మతం, దేవుడు అంటారన్నారు. మనం కూడా బ్రహ్మాండమైన యాదాద్రి ఆలయం వెయ్యేండ్లు ఉండే లా కట్టుకున్నా మనం చెప్పుకోలేదు.

ఆలయమే కాదు ఆధునిక దేవాలయం కాళేశ్వ రం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుని దేశంలోని వరి ఎక్కువగా పండే విధంగా తీర్చుదిద్దుకున్నామని పేర్కొన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చామన్నారు. నిరుద్యోగలకు రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టినా సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేసిన తప్పుడు ప్రచారాలనే నమ్మారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చేయలేదని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500, ఫించన్లు రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ చెప్పి మోసం చేసిందన్నారు.

ఇవేమీ అమలు చేయకున్నా చేసి నట్లు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాందీ చెప్పుకుంటున్నారని మం డిపడ్డారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి గల్లా పట్టు కుని అడిగే దమ్మున్న నాయకులు కావాలని పిలుపునిచ్చారు. మండలి పట్టభద్రుల ఎన్నికల్లో బిట్స్‌పిలానీలో చదువుకున్న ఉన్నత విద్యావంతుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డిని బీఆర్‌ఎస్ అభ్యర్ధిగా నిలబెట్టామని, అటువైపున బ్లాక్‌మెయిలర్, రాజకీయ విలువలు లేని బెదిరింపులతో దిక్కుమాలిన దందాలు చేసే వ్యక్తి ఉన్నారన్నారు. పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను ఎన్నుకోవాలని కోరా రు.

బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తామే అభ్యర్థులుగా రంగంలోకి దిగి పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. భువనగిరి నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి, ఆలేరులో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, నార్మాక్స్ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.