20-05-2024 01:37:02 AM
ఎన్నికల హామీలను కాంగ్రెస్ విస్మరించింది
బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలి
* మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయం. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో నమ్మకం పోయింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే కాంగ్రెస్ కొనసాగిస్తోంది. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలి.
సూర్యాపేట, మే 19 (విజయక్రాంతి): రాహుల్ గాంధీ ప్రధాని కావడం కల అని మాజీ మంత్రి, మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం నిర్వహించిన వరంగల్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.
కేంద్రంలో అధికారంలోకి వస్తామని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కాంగ్రెస్ కల కంటోందని, అది కలగానే మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం లో బీజేపీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై 6 నెలల కాలంలోనే ప్రజల్లో నమ్మకం పోయిందని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే కాంగ్రెస్ కొనసాగిస్తోందని, ఎన్నికల హామీలను విస్మరించిందని విమర్శించారు.
రాష్ట్రం లో ఇక బీఆర్‌ఎస్‌కు స్థానం లేదని, తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా అవతరి స్తుందని పేర్కొన్నారు. ఎమ్మె ల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు నారపరాజు రామచంద్రరావు, ఏబీఎ న్ రెడ్డి, కాటే పల్లి జనార్దన్, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు జీ వెంకటయ్య, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్‌చంద్ర పాల్గొన్నారు.