రైతుల ప్రతి ఫిర్యాదును స్వీకరించి భూభారతిలో పరిష్కరిస్తాం
కలెక్టర్ హనుమంతరావు...
వలిగొండ (విజయక్రాంతి): రైతుల ప్రతి ఫిర్యాదును స్వీకరించి భూభారతిలో పరిష్కరిస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు(District Collector Hanumantha Rao) అన్నారు. బుధవారం వలిగొండ మండలంలోని నాగారం గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాలలో రైతులకు సంబంధించిన ఎన్నో భూ సమస్యలు కొన్ని ఏండ్లుగా ఆపరిష్కృతంగా మిగిలిపోయాయని భూభారతి ద్వారా వాటిని పరిష్కరించే అవకాశం ఉందని అన్నారు. రైతుల భూములకు సంబంధించిన సమస్యల దరఖాస్తులను గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులో రెవెన్యూ సిబ్బంది స్వీకరించడం జరుగుతుందని వాటిని పరిశీలించి పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ, డిప్యూటీ తహసిల్దార్ పల్లవి, ఎంఆర్ఐ కరుణాకర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మనోహర్, రెవిన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.






