15 June, 2026 | 10:03 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

240 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు కేటాయిస్తాం

13-01-2026 01:45 PM

నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం.

చిట్యాల,(విజయక్రాంతి): నిర్మించి ఉన్న 240 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు కేటాయిస్తామని చిట్యాల మున్సిపాలిటీలో పర్యటించిన నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం(Nakrekal MLA Vemula Veeresham) తెలిపారు. మంగళవారం మున్సిపాలిటి పరిధిలోని 01వ వార్డులోని శివనేనిగూడెం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటి పరిధిలోని ఒకటో వార్డులో పర్యటన చేశామని, ఈ వార్డులో ఉన్న ప్రజలు డంపింగ్ యార్డుతో ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని జననివాసానికి  దూరంగా మార్చటానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. శివనేనిగూడెంలో ఇండ్లు లేని పేదవారు చాలా మంది ఉన్నారని, గడిచిన పది  సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో  ఇండ్లు ఇవ్వలేదని, ఈ మార్చిలో 60 ఇందిరమ్మ ఇండ్లు ఈ వార్డుకు కేటాయిస్తామని పేర్కొన్నారు. గత పాలకులు చేసిన పాపం ఈ డంపింగ్ యార్డును జననివాసాలకు దగ్గరగా ఏర్పాటు చేయడం వలన దుమ్ము దూళితో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని,డంపింగ్ యార్డును కచ్చితంగా మార్చుతామని తెలిపారు.

చెరువు పూడిక తీయిస్తామని, చిట్యాల లో అన్ని వార్డుల్లో ప్రతి పేద వారికి ఇండ్లు ఇస్తామని, చిట్యాల లో నిర్మించి ఉన్న 240 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, వనమా వెంకటేశ్వర్లు, కనక దుర్గాదేవి ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్, తాసిల్దార్ బి.విజయ ముఖ్య నాయకులు కార్యకర్తలు  తదితరులు  పాల్గొన్నారు.