13-01-2026 01:49:37 PM
రోడ్డు ప్రమాదాల నివారణకు
అరైవ్–అలైవ్ పేరుతో పోలీసుల అవగాహన
ఉప్పల్, విజయక్రాంతి: రోడ్డు ప్రమాద నివారణ లక్ష్యంగా నాచారం పోలీసులురోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్–అలైవ్ పేరుతో పోలీసుల అవగాహన కార్యక్రమాన్ని మల్లాపూర్ ఎన్ఎఫ్సీ బ్రిడ్జి వద్ద నిర్వహించారు. రోడ్డు భద్రత మనందరి బాధ్యత అంటూ వాహనదారులతో నినాదాలను చేయించారు. ఈ సందర్భంగా నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ మాట్లాడుతూ నిర్లక్ష్యమే ప్రాణాంతకమని ప్రతి ఒక్కరు రోడ్ సేఫ్టీ రూల్స్ ను పాటించాలని సూచించారు. హెల్మెట్ సీట్ బెల్ట్ లేకుండా వాహనాలునడపరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాల నివారించవచ్చని ఆయన సూచించారు. ఒక ప్రమాదంతో కుటుంబాలుచిన్నాభిన్నమవుతాయని అలా జరగకుండా ఉండాలంటే నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకుండా ప్రమాదాలను నివారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని యెడల ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాచారం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య మై బల్లి ప్రభాకర్ రెడ్డి ఏఎస్ఐ ఈదయ్య నాయకులు కప్పర సాయి నెమలి అనిల్ కుమార్ నాచారం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు