13-01-2026 01:42:47 PM
ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్
సంక్రాంతి ముగ్గుల పోటీలో మహిళలకు సూచన
ఉప్పల్, విజయక్రాంతి: చరవానిలో వచ్చే అపరిచిత యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్ అన్నారు. మల్లాపూర్ డివిజన్లోని చాణిక్యపురి కాలనీ అసోసియేషన్ శ్రీ దుర్గా మల్లేశ్వరి పోచమ్మ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరవాణి కేవలం సమాచారాన్ని చేరవేరుస్తానికి ఉపయోగించాలని వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్ లో ని స్టేటస్ పెట్టి వెల్లడించొద్దన్నారు. ఏఐ సాఫ్ట్ వేర్ వచ్చిన తర్వాత ఫోటో మార్ఫింగ్ చేసి అగంతకులు బ్లాక్మెయిల్ పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
మార్నింగ్ వాకింగ్ వెళ్లే మహిళలు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త వహిస్తూ ఏదైనా అనుమానం వస్తే 100 సమాచార ఇవ్వాలని ఆయన కోరారు. అనంతరం మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ఇంటి ముందు రంగువలులతో వేసే ముగ్గులు సాంప్రదాయానికి నిదర్శనం అన్నారు. అనంతరం ముగ్గుల పోటీ విజేత మహిళలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో నాచారం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య మైబల్లి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ మల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు కప్పర సాయి మల్లాపూర్ బిజెపి నాయకులు శైలేష్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ గంధమల రాములు కృష్ణ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు దశరథ్ ఉపాధ్యక్షులు కిషోర్ గౌడ్ పాల్గొన్నారు