పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
- వారం రోజుల్లో విడుదల చేయని పక్షంలో వేలాదిమంది విద్యార్థులతో సీఎం ఇంటిని ముట్టడిస్తాం
- బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అర్.కృష్ణయ్య హెచ్చరిక
ముషీరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): గత 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, గిరిజన వసతి గృహ విద్యార్థులకు సంబందించి డైట్, కాస్మోటిక్, రెంట్, వర్కర్స్ జీతాలు, ఇతర బిల్లులు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. వారం రోజుల్లో విడుదల చేయనిపక్షంలో వేలాది మంది విద్యార్థులతో కలసి సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సంఘం రాష్ట్ర వర్కిం గ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ అర్ కృష్ణయ్య మాట్లాడారు. గత రెం డు నెలల క్రితం బిల్లుల విషయమై సీఎంను కలవగా గ్రీన్ ఛానల్ లో పెడతామని హామీ ఇచ్చి, విస్మరించారని అన్నారు.
సంక్షేమ హాస్టల్స్ లో బిల్లులు పెండింగ్ లో ఉండటం వలన సరులు సప్లై బంద్ అయ్యిందని అ న్నారు. అలాగే వర్కర్స్ జీతాలు, ఇతర నిర్వహణ బిల్లులు పెండింగ్ ఉన్నాయని అన్నా రు. దీంతో వసతి గృహ అధికారులు తీవ్ర మానసిక వత్తిడికి గురవుతున్నారని అన్నా రు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్, నాయకులు సీ.రాజేందర్, నర్సింహ, గొరిగె మల్లేష్ యాదవ్, శివ కుమార్ పాల్గొన్నారు.






