calender_icon.png 4 November, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెజ్జంకిలో రోడ్డు ఆక్రమణలు తీవ్రతరం

04-11-2025 01:54:28 AM

  1. అధికారుల నిర్లక్ష్యంతో ట్రాఫిక్ స్తంభన 
  2. 4 లైన్ల రోడ్డు, 2 లైన్ల పరిమితం

బెజ్జంకి, నవంబర్ 3: సిద్దిపేట జిల్లా బె జ్జెంకి మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు క్రమంగా ఆక్రమణలతో ఇరుకుగా మారుతున్నాయి. 4 లైన్ల రోడ్డు కాస్తా 2 లైన్లకు మారింది. ముఖ్యంగా అంబేద్కర్ కూ డలిలో రోడ్లపై వ్యాపారులు అనధికారికంగా తమ వ్యాపారాలను విస్తరించడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. దుకాణ సముదాయాల ముందు రోడ్లపై వాహనాలను నిలపడం వల్ల విస్తారంగా ఉన్న రహదారులు కూడా ఇరుకైన వీధులుగా మారిపోతున్నాయని స్థా నిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్రా ఫిక్ నియంత్రణకు బాధ్యత వహించాల్సిన అధికారులు ఈ సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వె ల్లువెత్తాయి. పట్టణంలో ఎక్కడికైనా ప్రయాణించాలంటే రోడ్లమధ్య నిలిపిన వాహనా లు, ఇసుక, మట్టి కప్పులు, వ్యాపార వస్తువు లు అంతరాయం కలిగిస్తున్నాయి. పోటీగా వ్యాపారులు తమ షాపులను రోడ్డుపైకి వచ్చేలా ఏర్పాటు చేసుకోవడంతో పాదచారులకు ప్రయాణం మరింత క్లిష్టమవుతోంది. 

ఇసుక నిల్వలతో రోడ్లు ప్రమాదకరంగా 

బస్టాండ్ అవరణం వద్ద స్థానిక నివాసి యేండ్ల తరబడి ఇంటి నిర్మాణం కోసం రో డ్డుపై ఇసుక నిల్వ చేయడంతో రహదారి మ రింత ఇరుకుగా మారింది. వాహనదారులు, స్కూల్ విద్యార్థులు ప్రతిరోజూ ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. గడచిన కొన్ని నెలలుగా ఈ సమస్యను అధికారులు గమనించినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో ఆగ్రహం చెలరేగేలా చేసింది. 

అధికారులు పట్టించుకోవాలి.. 

బెజ్జంకి మండల కేంద్రం రోజూ పరిసర గ్రామాల వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రం గా మారుతోంది. వాహనాల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ట్రాఫిక్ నియంత్రణ అవసరం అత్యవసరమైంది. కానీ అధికారులు కేవలం సైరన్ వాహనాలతో ఎత్తిపోతులు చేయడ మే తప్ప రోడ్లపై పార్కింగ్ను తొలగించడంలో శ్రద్ధ చూపకపోవడం గమనార్హం. ఫ లితంగా వాహనాలు ఇష్టానుసారంగా పార్క్ చేయబడుతుండడంతో రహదారులపై కిక్కిరిసిన పరిస్థితి ఏర్పడుతోంది.

 పంచాయతీ చర్యలేవీ.. 

ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రణీత్ రెడ్డినీ విజయ క్రాంతి వివరణ కోరగా ఇలా స్పందించారు. మండల కేం ద్రంలోని ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కఠి న చర్యలు చేపడతాం. రోడ్డుపై వాహనాలు నిలిపే వారికి జరిమానాలు విధిస్తాం. రహదారులను ఆక్రమించి వ్యాపారాలు నిర్వ హిం చే వారికి నోటీసులు జారీ చేస్తాం. రోడ్డు పై ఇసుక నిల్వ చేసిన వ్యక్తికి కూడా నో టీసు లు పంపించాం. అతిక్రమిస్తే ఆ ఇసుకను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. 

నిబంధనల అమలు అత్యవసరం 

స్థానిక ప్రజలు అధికారులను విజ్ఞప్తి చేస్తూ, ట్రాఫిక్ రహదారి నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, వ్యాపారులు, వాహనదారులు ప్రభుత్వ నియమా వళి పాటించాలని కోరుతున్నారు. గ్రామ పంచాయతీ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో చర్యలు తీసుకుంటే మాత్రమే అభి వృద్ధి చెందుతున్న బెజ్జెంకిలో రవాణా అవరోధాలు తగ్గవచ్చని ప్రజలు అంటున్నారు.