calender_icon.png 11 February, 2026 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటాం

11-02-2026 01:17:08 PM

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు కు బ్రహ్మరథం పడుతున్నారు 

కమాన్ పూర్ లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

మంథని, కమాన్ పూర్,(విజయక్రాఃతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం ఉదయం కమాన్ పూర్ క్రాస్ రోడ్డు వద్ద మంత్రి పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు.

అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామగుండం, కరీంనగర్, కార్పొరేషన్లను పూర్తిస్థాయిలో కాంగ్రెస్ కార్పొరేటర్ గెలిచి పొందుతుందని, ఆయా రెండు పీఠాలను హస్తగతం చేసుకుంటామని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్, మంథని, పెద్దపల్లి అలాగే కరీంనగర్ జిల్లాలోని మొత్తం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తిస్థాయిలో అమలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

గతంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓటు వేశారని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోందని పేర్కొన్నారు. అన్ని స్థానాల్లో స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన లో ప్రజలు ఆనందంగా ఉన్నారని అలాగే మా టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం అయిందని అన్నారు.

ఇచ్చిన వాగ్దానాల్లో ఉచిత బస్సు, ఉచిత విద్యుత్తు, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయడం జరుగుతుందని, నేడు తెలంగాణలోని ప్రతి ఒక్కరి కళ్ళలో కాంగ్రెస్ పాలనలో ఆనందం వెల్లివిరుస్తోందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కమాన్ పూర్ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీపీ కోలేటి మారుతి, మాజీ సింగల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కరరావు, పేరా పల్లి సర్పంచ్ బొంగుని సదయ్య గౌడ్, గుండారం ఉపసర్పంచ్ అంబిరి రాజేందర్, వార్డు సభ్యులు పిడుగు సది, గరిగంటి కృష్ణ,బొడ్డు రవి, పిడుగు కవిత, రాచకొండ రజిత, మాజీ సర్పంచ్ ఆకుల ఓదెలు , ఆడువాలా చంద్రయ్య తోపాటు నాయకులు పిడుగు శంకర్, మతిన్ ఖాన్ ఇక్బాల్, లల్లు, వడ్లకొండ శంకర్, తదితరులు పాల్గొన్నారు.