22 June, 2026 | 2:34 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

తొలిసారి ఓటుతో బాధ్యత చాటిన శ్రీనిధి

11-02-2026 01:19 PM

యువ ఓటర్ల ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాల్లో సందడి

రామాయంపేట,(విజయక్రాంతి): ప్రజాస్వామ్య పండుగగా కొనసాగే మున్సిపల్ ఎన్నికల్లో యువత ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో మంజీర విద్యాలయం పోలింగ్ కేంద్రంలో యువతి శ్రీనిధి తన తొలి ఓటు హక్కును వినియోగించి బాధ్యతాయుత పౌరురాలిగా నిలిచింది. మొదటిసారి ఓటు వేయడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. “రాజ్యాంగం కల్పించిన ఈ శక్తివంతమైన హక్కు ప్రతి పౌరుడి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. యువతి–యువకులు అందరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి” అని శ్రీనిధి పిలుపునిచ్చింది.

పోలింగ్ ప్రారంభం నుంచే యువ ఓటర్లు ఉత్సాహంగా కేంద్రాలకు తరలివస్తుండటంతో 5వ వార్డులో సందడి వాతావరణం నెలకొంది. తొలి ఓటు వేసిన యువతను అధికారులు, సిబ్బంది అభినందించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన సాధనమని, యువత భాగస్వామ్యం ఎన్నికల విజయానికి ప్రతీకగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు. మొదటిసారి ఓటు వేస్తున్న యువతలో కనిపిస్తున్న చైతన్యం ప్రజాస్వామ్యానికి శుభ సూచకమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తంగా రామాయంపేటలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుండగా, యువ ఓటర్ల స్పందన ఎన్నికలకు కొత్త ఊపునిచ్చింది.