20 May, 2026 | 2:45 AM

కోడిపందాలు ఆడేవారిపై ఉక్కుపాదం మోపుతాం

20-05-2026 12:01 AM

మూగజీవాలను హింసించడం చట్టరీత్యా నేరం....

కోడిపందాలు ఆడిన14 మంది అరెస్ట్....

40 వేల నగదు, కారు, 13 మొబైల్ ఫోన్లు, 07, ద్విచక్ర వాహనాలు, 06 కోడి పుంజులు,06 కత్తులు స్వాధీనం....

వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి

సుల్తానాబాద్, మే 19 (విజయక్రాంతి): కోడి పందాలు ఆడే వారిపై ఉక్కు పాదం మోపుతామని, మూగ జీవాలను హింసించడం చట్టరీత్యా నేరమని పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి అన్నారు, మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలిగేడు మండలం శివపల్లి గ్రామ శివారులోని బోడా గుట్ట వద్ద రహస్యంగా, చట్టవిరుద్ధంగా కోడిపందేలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని మీడియా ముందు హాజరు పరిచారు.

మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించి, పకడ్బందీగా 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు...6 పందెం కోళ్ళు , 6 కత్తులు ,13 మొబైల్స్ , 1ఎర్టిగా కారు , 7 ద్విచక్ర వాహనాలు, 40 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నమన్నారు..కోడి పందాలు ఆడడం చట్ట విరుద్ధం, వీటిలో పాల్గొనడం నిర్వహించడం నేరమని హెచ్చరించారు. కోడి పందేల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలగడంతో పాటు మూగజీవాలను హింసించడం చట్టరీత్యా నేరం అన్నారు.

ఎక్కడైనా కోడి పందాలు ఆడితే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలన్నారు, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు, అరెస్ట్ అయిన 14 మంది వ్యక్తులు శివ పల్లి కి చెందిన కార్తీక్ రావు, శంకర్, రాజు, పెద్దపల్లికి చెందిన రాజు, మందమర్రి గుడిపల్లి కి చెందిన పవన్, ఇందారం కు చెందిన రాకేష్ , గోదావరిఖని కి చెందిన మనోహర్ , రహీం, ఇందారం కు చెందిన రవీందర్ , సతీష్ , పెద్దపల్లికి చెందిన నాగరాజు , రామగిరి కి చెందిన మహేష్ , టేకుమట్ల జైపూర్ కు చెందిన సమాద్ , పెద్దపల్లికి చెందిన అఖిల్ ల ను అరెస్ట్ చేయటం జరిగిందన్నారు.

పెద్దపల్లి డి.ఎస్.పి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో పెద్దపల్లి ఏసిపి కృష్ణ , పెద్దపల్లి , సుల్తానాబాద్ సిఐ లు రంజిత్ రావ్ , కే , ప్రవీణ్ , సుల్తానాబాద్ ఎస్త్స్ర చంద్రకుమార్, జూలపల్లి ఎస్త్స్ర సనత్ రెడ్డి , ఎలిగేడు ఎస్త్స్ర మధుకర్, బసంత్ నగర్ ఎస్త్స్ర శ్రీధర్ , ఎస్త్స్ర నరేష్ తో పాటు సిబ్బంది ఈ దాడులు నిర్వహించడం జరిగిందన్నారు, ఈ దాడుల్లో పాల్గొని కోడిపందాల ముఠా పై దాడులు నిర్వహించి 14 మందిని పట్టుకునేందుకు పకడ్బందీగా విధులు నిర్వహించిన వీరికి త్వరలోనే నగదు రివార్డులు అందజేయడం జరుగుతుందని డిసిపి రామ్ రెడ్డి వివరించారు.