ప్రతిభా పురస్కారం అందుకున్న గుండమల్ల అక్షిత
సంస్థాన్ నారాయణపూర్, మే 19 : మండల కేంద్రానికి చెందిన గుండమల్ల అక్షిత రవీంద్రభారతిలో ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభా పురస్కారం అందుకుంది.ప్రభుత్వ పాఠశాలలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ‘ప్రతిభా పురస్కారం - 2026‘ద్వారా అవార్డులు అందజేశారు.
పదవతరగతిలో 569 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచిన అక్షితకు నిర్వాహకులు పురస్కారం అందజేశారు. విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ప్రధానోపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా గౌరవ సన్మానం చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కోదండరాం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.






