9 June, 2026 | 1:49 AM

విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చూడాలి

09-06-2026 12:45 AM

మంత్రి సీతక్క ఆదేశం 

ములుగు (మహబూబాబాద్) జూన్ 8 (విజయక్రాంతి): విద్యా సంవత్సరం మరో వారం రోజుల్లో ప్రారంభిస్తున్న నేపథ్యంలో ములుగు జిల్లాలో విద్యార్థులకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు లేకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, మెరు గైన వసతి కల్పించాలని, పాఠశాలలు, వసతి గృహాల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, సురక్షిత, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని, అధికారులు స మన్వయంతో పనిచేసి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని  మంత్రి సీతక్క అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

సోమవా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జీ, ఎం. సంపత్ రావుతో కలిసి పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు, వసతి గృహాల పునఃప్రారంభంపై సంబంధిత శాఖల అధికారులతో హైదరాబాద్ నుంచి టెలిఫోన్ ద్వారా మంత్రి సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సంద ర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి పాఠశాల, వసతి గృహంలో అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అన్ని విద్యాసంస్థల భవనాలు, తరగతి గదులు, వసతి గృహ గదులు, వంట శాలలు, భోజనశాలలు, మరుగుదొడ్లు, తా గునీటి ట్యాంకులను పూర్తిస్థాయిలో శుభ్రపరచాలని సూచించారు. వర్షాకాలం దృ ష్ట్యా పాఠశాల ఆవరణలో నీరు నిల్వ ఉండకుం డా, దోమల నివారణకు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. అధికారులు వసతి గృహాలు, పాఠశాలలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.