30 June, 2026 | 8:37 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

అమీర్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం

08-03-2026 03:46 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): అమీర్ పేటలోని ప్రభుత్వ హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన అమీర్ పేటలోని 50 పడకల ప్రభుత్వ హాస్పిటల్ లో 14 సంవత్సరాల లోపు బాలికలకు వేసే HPV వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ లో అందుతున్న సేవలు, సౌకర్యాలు, సమస్యల గురించి పేషేంట్స్, హాస్పిటల్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమీర్ పేట, సనత్ నగర్ పరిసర ప్రాంతాలలోని పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సహకారంతో 50 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేసినట్లు వివరించారు. పేద ప్రజలకు 50 పడకల హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం అందుతుండటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. హాస్పిటల్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో 100 పడకల హాస్పిటల్ గా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రయివేట్ హాస్పిటల్ లో సరైన వైద్యం చేయించుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో  కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆర్ఎంఓ వినాయక్ రావు, సూపరింటెండెంట్ రవూప్,  బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు నామన సంతోష్ కుమార్,  కూతురు నర్సింహ, కట్టా బలరాం, సుమిత్ సింగ్, గోపీలాల్ చౌహాన్, హరిసింగ్, జితేందర్ శుక్లా తదితరులు పాల్గొన్నారు.