calender_icon.png 20 December, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల భాగస్వామ్యంతో ప్రతి కాలనీని అభివృద్ధి చేస్తాం

20-12-2025 12:00:00 AM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు

హనుమకొండ టౌన్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ లో ఇందిరమ్మ కాలనీ పేస్ వన్, పండ్ల మార్కెట్ రోడ్డు, లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్ కాలనీలలో అంతర్గత రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైనేజీలా నిర్మాణ పనులకు సుమారు 2 కోట్ల 70 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు డివిజన్లో ప్ర జలతో స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకుని మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వె నుకబడిన ప్రతి కాలనీని అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు.

అ భివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలు పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజా ప్రభుత్వం ప నిచేస్తుందని తెలిపారు. ఏనుమాముల గ్రామంలో శివాలయలింగము, బొడ్రాయి పున ప్రతిష్ట కార్యక్రమలకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఇందిరమ్మ కాలనీ పేస్ వన్ లో ప్ర ధాన సమస్యగా ఉన్న స్మశాన వాటిక, రేషన్ షాప్, అంగన్వాడి, ఇంటి నెంబర్ల, ఇళ్ళపట్టాలు తదితర సమస్యలు త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, స్థానిక డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్, వివిధ గ్రామల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.