20-02-2026 07:13:24 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలోని పన్నుల బకాయిలు అధిక మొత్తంలో ఉన్న వారిపై ఆ శాఖ రెవెన్యూ అధికారులు కొరడా జూలిపిస్తున్నారు. ఈ మేరకు అధిక మొత్తంలో బకాయి పడ్డ వారికి మొదటగా రెడ్ నోటీసులు ఇచ్చి కట్టకపోవడంతో వారి ఆస్తులకు తాళం వేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఒక ఇంటికి తాళం వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ రామకృష్ణ, ఆర్ఐ రాజు, బిల్ కలెక్టర్ రమేష్, రాకేష్, తదితరులు ఉన్నారు.