20-12-2025 12:00:00 AM
జక్కిడి చారిటబుల్ ట్రస్ట్‌కు అందజేత
హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని నాగోల్ డివిజన్ (ప్రస్తుత సాయినగర్ కాలనీ డివిజన్) పరిధిలోని సాయి సప్తగిరి కాలనీలో నూతనం గా నిర్మిస్తున్న శివాలయానికి జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.50,000 విరాళాన్ని ట్రస్ట్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దైవ కార్యాల్లో భాగస్వామ్యుడిని అయ్యే అవకాశం కల్పించిన శివాల యం ట్రస్ట్ సభ్యులకు, కాలనీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
పరమశివుడి ఆశీస్సులు డివిజన్ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.అదే విధంగా మహిళల స్వావలంబనకు దోహదపడేలా జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాల ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 80 మంది ఆడపడుచులకు సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సతీమణి దేవిరెడ్డి కమలా సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మహిళలకు స్వయంగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ సేవలను అభినందించారు.ఈ కార్యక్రమాల్లో సాయి సప్తగిరి కాలనీ అధ్యక్షులు మురళీ కృష్ణ, శివాలయం ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ శర్మ, ట్రస్ట్ సభ్యులు, కాలనీ పెద్దలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.