నాగర్‌కర్నూల్‌ను అభివృద్ధి చేస్తాం
మల్లు రవిని గెలిపించండి
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
రంగారెడ్డి, మే2(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్య ర్థి మల్లు రవిని గెలిపించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కోరారు. గురువారం కడ్తాల, మాడ్గుల మండలాలలో పార్లమెం ట్ ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా ముద్విన్, అన్నెబోయిన్‌పల్లి, బ్రహ్మణపల్లి గ్రామా ల ప్రజల వద్దకు వెళ్లి ఆరు గ్యారెంటీ పథకాలను వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే పథకాలను అమలు చేస్తున్నారని, మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేస్తున్నట్లు గుర్తుచేశారు. పార్లమెం ట్ ఎన్నికలో మల్లు రవిని గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




