ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
కామారెడ్డి ప్రజావాణిలో 117 దరఖాస్తులు
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు వెంటవెంటనే అధికారులు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ సూచించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి 114 దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో దరఖాస్తు చేస్తే పని అవుతుందని ఆశిస్తారని ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అర్జిదాలలో నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పెండింగ్లో లేకుండా వెంట వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, జెడ్పి సీఈవో చందర్ నాయక్, ఆర్డీవో ఎన్ వై గిరి, లు పాల్గొన్నారు. అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల సంబంధించిన వివిధ రకాల సమస్యలపై వచ్చిన ఆర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ తక్షణ స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.




