30 March, 2026 | 6:24 PM

పథకాలు నచ్చే కాంగ్రెస్‌లో చేరికలు

03-05-2024 02:01 AM

చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి

రంగారెడ్డి, మే2(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలను చూసి బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. మొయినాబాద్ మండలంలోని సురంగల్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన నాయకులు రంజిత్‌రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. తనకు ఓటు వేసి గెలిపియాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మహేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, దర్శన్ తదితరులు పాల్గొన్నారు.