30 March, 2026 | 6:21 PM

రైతుల అభివృద్ధి కోసం సొసైటీలు నిర్విరామ కృషి

30-03-2026 04:46 PM

లాభాల బాటలో సుల్తానాబాద్ సింగిల్ విండో

మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రైతుల అభివృద్ధి కోసం నిరంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సింగిల్ విండోలు) కృషి చేస్తున్నాయని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్  సింగిల్ విండో లో 132వ సర్వ సభ్య సమావేశం సింగిల్ విండో ఇంచార్జ్  యన్. వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. తేది 01-10-2025 నుండి 28-03-2026 వరకు జరిగిన ఆదాయ, వ్యయాలను సంఘ కార్యదర్శి బూరుగు సంతోష్ సమావేశంలో చదివి వినిపించారు.

2026-27 సంవత్సరం అంచనా బడ్జెట్ ను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. పలు అంశాలపై తీర్మానలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ... సుల్తానాబాద్ సొసైటీ వివిధ రకాల వ్యాపారాలను నిర్వహిస్తూ రైతులకు ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుందని రైతులకు సంబంధించిన పూర్తి ఫెర్టిలైజర్ ఎరువులు అందుబాటులో ఉంచుతూ రైతులకు ఎల్లవేళలా సేవలందిస్తుందని అలాగే సూపర్ మార్కెట్ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి సేవలందిస్తుందని త్వరలో పెట్రోల్ పంప్ ప్రారంభించి రైతులకు మరింత చేరువ కానుందని  అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్  అంతటి పుష్పలత, మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ ఉస్తేము గణేష్, కౌన్సిలర్స్  గాజుల రాజ మల్లయ్య, కందునురి సమత, గరిగే శోభ రాణి, వర ప్రదీప్, చింతల రాజు, తొర్రికొండ ప్రభాకర్, సిద్ద తిరుపతి, వేగోళం పద్మ, గాదాసు మంజుల , మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ లక్ష్మి నారాయణ, బావు రాజేందర్  మాజీ పాలక వర్గ సభ్యులు, మాజీ సర్పంచ్ లు సంఘ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

నూతన మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన నూతన మున్సిపల్ పాలకవర్గాన్ని పిఎసిఎస్ కార్యదర్శి బూరుగు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘనంగా సన్మానించారు..