23 May, 2026 | 2:48 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

ప్రజావాణికి 205 దరఖాస్తుల రాక

30-03-2026 04:36 PM

స్వీకరించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్

పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ప్రజావాణిలో అర్జీలు కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్వీకరించి.. పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి.. ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. మొత్తం 205 అర్జీలు రాగా, ఆయా శాఖల అధికారులకు అందజేశారు. రెవెన్యూ శాఖకు 82, గృహ నిర్మాణ శాఖకు 35, డీఆర్డీఓకు– 30, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 9, ఉపాధి కల్పన అధికారికి -8, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఎస్పీ కార్యాలయానికి ఐదు చొప్పున, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా సంక్షేమ అధికారి 4, జిల్లా పౌర సరఫరాల శాఖ, జిల్లా వైద్యాధికారి, నీటి పారుదల శాఖ అధికారికి మూడు చొప్పున, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్, డీఎం ఆర్టీసీ సిరిసిల్ల, సెస్ ఎండీకి రెండు చొప్పున, చేనేత అండ్ జౌళి శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, బీసీ సంక్షేమ అధికారి, జిల్లా విద్యాధికారి, అటవీ శాఖాధికారి, మైనింగ్ అధికారి, జిల్లా ఎక్సైజు అధికారి, యువజన అండ్ స్పోర్ట్స్ అధికారి, ఈడీఎం, జీజీహెచ్ సిరిసిల్ల, సబ్ రిజిస్టార్ సిరిసిల్ల, మెప్మా కార్యాలయానికి ఒకటి చొప్పున రాగా.వాటిని సంబంధిత కార్యాలయాలకు పంపించారు.ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు తదితరులు పాల్గొన్నారు.