27 June, 2026 | 7:04 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తాం

14-03-2026 12:00 AM

యాదగిరిగుట్ట, మార్చి 13: రాష్ట్రంలోనే యాదగిరిగుట్టను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో మొదటి  పాలకవర్గం సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండవ తిరుప తిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీన రసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పని చేస్తామని హామీ ఇచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి సహకా రంతో ప్రత్యేక నిధులు మంజూరు చేపించి యాదగిరిగుట్ట మున్సిపాలిటీ మిగతా మున్సి పాలిటీలకు ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ మాట్లాడుతూ  ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలని ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సలహాలు సూచనల మేరకు యాదగిరిగుట్టను రోల్ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఎజెండాలోని ప్రతి అంశాన్ని చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ వైస్ చైర్మన్ బరిగే రమ్య రామచందర్, కౌన్సిలర్లు  బబ్బూరి శ్రీధర్ గౌడ్, ముచ్చర్ల మల్లేష్ యాదవ్, పేరబోయిన సత్యనారాయణ యాదవ్, పెనిమిల్లి లావణ్య, బోడ రాధా, కమిషనర్ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.