14 March, 2026 | 7:43 AM

అక్రమంగా నిల్వచేసిన 41 సిలిండర్లు సీజ్

14-03-2026 12:00 AM

సూర్యాపేట, మార్చి 13 (విజయక్రాంతి): అక్రమంగా నిల్వచేసిన 41 సిలిండర్లను సూర్యాపేట పట్టణ పోలీసులు ,స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగాసూర్యాపేట పట్టణంలో పిఎస్‌ఆర్ సెంటర్లో ఒక షాపులో తనిఖీలు చేసి శుక్రవారం సీజ్ చేశారు. ఇందులో గృహ ఉపయోగకరమైనవి 21, వాణిజ్యపరమైనని 20 ఉన్నాయి. అక్రమంగా గ్యాస్ సిలిండర్ ల వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె.నర్సింహ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు ఉపయోగపడే గ్యాస్ సిలిండర్లను అక్రమ మార్గంలో అమ్మిన, అక్రమంగా నిలువచేసిన, కృత్రిమ కొరత సృష్టించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహ ఉపయోగకరమైన గ్యాస్ సిలిండర్లను వాణిజ్యపరంగా అమ్మకూడదని సూచించారు. ప్రజల ఉపయోగాలు, హాస్పటల్ వినియోగానికి నిలువలు అందుబాటులో ఉన్నాయన్నారు.

గ్యాస్ సిలిండర్ లను అక్రమ మార్గంలోకి తరలించినా, గ్యాస్ నిల్వలపై, గ్యాస్ ధరలపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు. ప్రజల అవసరాలకు సరిపడా గ్యాస్ సిలిండర్ నిలువలు అందుబా టులో ఉన్నాయని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనల ప్రకారం సంబంధిత ఏజెన్సీలు గ్రామాలలో, పట్టణాలలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లను సకాలంలో అందిస్తాయన్నారు. ప్రజలు ఆందోళన చెంది గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరవద్దని, గ్యాస్ టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని కోరారు. గ్యాస్ ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా నకిలీ వ్యక్తులు గ్యాస్ ను బుక్ చేసినట్లయితే అలాంటి వారిని గుర్తించాలని సూచించారు.