ఎమ్మెల్యే సమక్షంలో ఆలయ కమిటీ ఎన్నిక
14-03-2026 12:00 AM
కోదాడ, మార్చి 13: కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలోని శ్రీ వరవర రంగనాయకస్వామి వారి దేవాలయ నూతన కమిటీని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సమక్షంలో శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ చైర్మన్ గా ఇర్ల వరహాలరెడ్డి, సభ్యులుగా కంపసాటి ఐతమ్ రాజు, బలుగూరి తిరపతమ్మ, శెట్టి అప్పారావు, రాపోలు చిన్న వీరయ్య, బాలెబోయిన వెంకటేశ్వర్లు, ఆతుకూరి నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు. సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య, మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి హిమబిందు సుమన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.




