calender_icon.png 14 February, 2026 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పారడైజ్-శామీర్‌పేట’లో న్యాయం చేస్తాం

14-02-2026 12:20:47 AM

  1. ప్రాజెక్టు భూ నిర్వాసితులతో ప్రత్యేక సమావేశం
  2. అభిప్రాయాలు, భూసేకరణలో పారదర్శకత పాటిస్తాం
  3. ట్రాఫిక్ కష్టాల నివారణకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకం: కలెక్టర్ హరిచందన

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పారడైజ్ జంక్షన్ టూ శామీర్ పేట ఓఆర్‌ఆర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతున్నాయి. ఈ ప్రా జెక్టు కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత, స్పష్టత ఉండేలా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి స్పష్టం చేశారు.

శుక్ర వారం హైదరాబాద్ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసి తులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తమ భూములను, ఆస్తులను కోల్పోతున్న బాధితుల నుంచి ఆమె అభిప్రాయాలను సేకరిం చారు. పారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు మొత్తం 18.70 కిలోమీటర్ల మేర ఈ భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు.

ఇందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో పారడైజ్ నుం చి లోతుకుంట వరకు సుమారు 11.70 కిలోమీటర్ల మేర భూసేకరణ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి తిరుమలగిరి, కాకాగూడ, తోకట్ట, మచ్చ బొల్లారం గ్రామాల పరిధిలోని భూ యజమానులు, నిర్వాసితులు ఈ సమావేశానికి భారీగా హాజరయ్యారు. వారి సందేహాలను, అభ్యంతరాలను స్వీకారించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ చిక్కులను తగ్గిం చడానికి, కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ ఎలివేటెడ్ కారిడార్ వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అభివృద్ధిలో భాగస్వాములవుతూ తమ భూములను ఇస్తున్న నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూ స్తామని భరోసా ఇచ్చారు.

అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో, నిబంధనల ప్రకారం పరిహారం అందుతుందని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కమిటీ స భ్యులతో పాటు భూసేకరణ అధికారి అపర్ణ, హెచ్‌ఎండీఏ భూసేకరణ అధికారి అర్చన, రోడ్లు  భవనాల శాఖ అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.