14-02-2026 12:20:15 AM
కన్నాయిగూడెం,ఫిబ్రవరి13(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవులా జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశ కార్యక్రమా న్ని గ్రామస్తులతో కలిసి గుర్రేవుల సర్పంచ్ అంబాల సౌజన్య శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గుర్రేవు ల మాజీ సర్పంచ్ పూజారి వెంకయ్య.
తన సొంత ఖర్చులతో పాఠశాల విద్యార్థులకు స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్,జవహర్ లాల్ నెహ్రూ, భగత్ సింగ్,చంద్రశేఖర్ అజాద్,వివేకానంద, సర్దార్ వల్లభాయ్ పటేల్, చదువులతల్లి సా విత్రి బాయి పూలే,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్,సరోజినీ నాయుడు, ఝాన్సీ రాణి,తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త ప్రో పేసర్ జయ శంకర్,తదితరులు మేధావుల చిత్రపటాలను పాఠశాల విద్యార్థులకు బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ మేధావుల జీవిత చరిత్రలు తెలుసుకుని విద్యార్థులు గొప్పప్రయోజకులు కావా లని కోరారు.