3 July, 2026 | 6:33 PM

Breaking News

డ్రగ్స్, నేర రహిత సమాజ నిర్మాణానికి తోడ్పడండి   •   జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలి   •   రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య   •   అంగన్వాడి పిల్లలకు యూనిఫార్మ్స్ పంపిణీ   •   టీపీసీసీ ప్రధాన కార్యదర్శిని పరామర్శించిన యువనేత ఇలియాస్   •   జిల్లాలో నిరుపేదలకు మున్నూరు కాపు సంఘం అండగా ఉంటుంది   •   కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •  

క్షిపణి దాడులతో యుద్ధం ముగిస్తాం

31-08-2024 01:08 AM
  1. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ 
  2. ఆంక్షలు ఎత్తివేయాలని విజ్ఞప్తి

న్యూ ఢిల్లీ, ఆగస్టు 30: క్షిపణుల ప్రయోగానికి మిత్ర దేశాలు అనుమతిస్తే రష్యాతో యుద్ధాన్ని త్వరగా ముగిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ స్పష్టం చేశారు. ఓవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రకటించినప్పుటి నుం చి రష్యా సదూర శ్రేణి క్షిపణి దాడులు చేస్తూనే ఉందని .. క్షిపణుల ప్రయోగంపై తమ దేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తే తాము కూడా రష్యా భూభాగంలోకి క్షిపణులను ప్రయోగిస్తామని జెలన్‌స్కీ స్పష్టం చేశారు. అమెరికా సహా ఇతర ఇతర మిత్ర దేశాలు ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకోవాని ఆయన కోరారు.

ఎఫ్ కూల్చివేసిన రష్యా..

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజగా ఉక్రెయిన్‌కు నాటో దళాలు అందించిన ఎఫ్ యుద్ధ విమానాన్ని శుక్రవారం రష్యా కూల్చివేసింది.  అయితే అమెరికా తయారు చేసిన ఈ ఎఫ్ విమానాలను కూల్చివేసే పైలెట్లకు రూ.లక్షా 70వేల డాలర్ల నజరానా ఇస్తామని ఇటీవల రష్యాకు చెందిన ఓ కంపెనీ తెలిపింది. దీనికి తోడు రష్యా తమ దేశంలోకి ప్రవేశించకుండా అమెరికాకు చెందిన పలు వార్తా సంస్థలకు చెందిన దాదాపు 92మంది పాత్రికేయులపై ఆంక్షలు విధించింది. వీరు తమ దేశం, సైన్యంపై కావాలనే విషప్రచారం చేస్తున్నట్లు రష్యా ఆరోపిస్తోంది.