17 March, 2026 | 2:44 AM

చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందిస్తాం

17-03-2026 12:28 AM

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు 

మెదక్, మార్చి 16(విజయ క్రాంతి) :జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వివాదాలు, పోలీస్ సంబంధిత ఇబ్బందులను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రా వుకు నేరుగా విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతి ఫిర్యాదుదారునితో వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సమస్యలను సమగ్రంగా తెలుసుకున్నారు.

అందిన ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించి, తక్షణమే పరిష్కార చర్యలు తీసుకునేలా సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్‌ఇన్స్పెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొన్ని అంశాలపై సంబంధిత ఎస్హెచ్‌ఓలతో ఫోన్ ద్వారా మా ట్లాడి, వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడు తూ, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని తెలిపారు. చట్టపరమైన మార్గం లో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.